నిశ్శబ్దం

నిశ్శబ్ద నిశీధి నుండి ……

కనుపాపల కొడిగట్టిన చిరు కాంతి తో

నిశ్శబ్దం లో శ్వాస తోడుగా

అడుగుకు అడుగే తోడుగా..

చేతి కి చెయ్యి చెలిమిగా ..

నిరామయం లో నిస్తేజంగా

నివురు కప్పిన నిప్పుల సెగో ,

కసి తేలిన కర్కశ ముల్లో ..

తెలియని నిస్చేతన మైన మస్తిష్కం తో ..

నిశీధి వంతెన పై సుదీర్ఘ  ప్రయాణం ….

కారుచీకటి లో కాలమెంత గడిచిందో

ఒక్కసారిగా వీచిన చల్లని పిల్లగాలి  స్పర్శ తో..

ఉలికి పడిన మనసు చైతన్యం నింపుకుంటూ ..

వడి వడి గా అడుగులు కదిపింది

నిర్జీవం నింపుకున్న కన్నులలో

తారల వెలుగు తళుకు మంది .

చేరువలో ఉషోదయం

భూపాలం తో నిశ్శబ్దాన్ని చేధించింది .

చేతిని  చల్లగా ఒక చెలిమి  పెనవేసింది..

నిశీధి మళ్లీ నిశ్శబ్దాన్ని వెతుకుతూ వెనుతిరిగింది..విజయ గోలి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language