నిశ్శబ్దం

న

నిశ్శబ్ద నిశీధి నుండి ……

కనుపాపల కొడిగట్టిన చిరు కాంతి తో

నిశ్శబ్దం లో శ్వాస తోడుగా …

అడుగుకు అడుగే తోడుగా..

చేతి కి చెయ్యి చెలిమిగా ..

నిరామయం లో నిస్తేజంగా…

నివురు కప్పిన నిప్పుల సెగో ,

కసి తేలిన కర్కశ ముల్లో ..

తెలియని నిస్చేతన మైన మస్తిష్కం తో ..

నిశీధి వంతెన పై సుదీర్ఘ  ప్రయాణం ….

కారుచీకటి లో కాలమెంత గడిచిందో …

ఒక్కసారిగా వీచిన చల్లని పిల్లగాలి  స్పర్శ తో..

ఉలికి పడిన మనసు చైతన్యం నింపుకుంటూ ..

వడి వడి గా అడుగులు కదిపింది …

నిర్జీవం నింపుకున్న కన్నులలో

తారల వెలుగు తళుకు మంది .

చేరువలో ఉషోదయం

భూపాలం తో నిశ్శబ్దాన్ని చేధించింది .

చేతిని  చల్లగా ఒక చెలిమి  పెనవేసింది..

నిశీధి మళ్లీ నిశ్శబ్దాన్ని వెతుకుతూ వెనుతిరిగింది..విజయ గోలి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language