దుర్ముఖి. ఉగాది

స్వాగతం ఉగాదికి.          విజయ గోలి

అందమైన  ఉగాది ఆగమనానికి

పుడమి తల్లి పులకిస్తూ  పలుకుతుంది  ఆహ్వానం

మంచు తెరలు  తొలగించి ,పరిచింది ఆకుపచ్చ  తివాచి

ప్రకృతంతా  పరవశంచి  చిగురాకుల

తొడుగుల తో చిరునవ్వులు పంచుతోంది

మత్తుగొలిపె వేపపూవుల వింజామర ,

వీవనలుగా పరిమళాలు నింపుతోంది .

గున్నమామిడి విరగకాసి గురుతు చేస్తోంది,

షడ్రుచులలో నా స్థానం  వగరు నింపిన పులుపంటూ.

చేదు మేసి  మావి  దాగిన గండుకోయిల

చెరుకు తేనెల మధుర రుచులను గళము నింపి ,

తేట తేనెల తెలుగు పలుకుల పాడుతుంది .

దుర్ముఖినామ తెలుగు ఉగాదికి స్వాగతగీతం

సర్వ జనుల జీవితాల దుర్ముఖి యాత్ర

సుముఖంగా ,శుభకరంగా సాగాలనిసురాగాలు ఆలపిస్తూ

తెలుపుతుంది నూతన సంవత్సర శుభాకాంక్షలు

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language