నిశ్శబ్ద నిశీధి నుండి ……
కనుపాపల కొడిగట్టిన చిరు కాంతి తో
నిశ్శబ్దం లో శ్వాస తోడుగా …
అడుగుకు అడుగే తోడుగా..
చేతి కి చెయ్యి చెలిమిగా ..
నిరామయం లో నిస్తేజంగా…
నివురు కప్పిన నిప్పుల సెగో ,
కసి తేలిన కర్కశ ముల్లో ..
తెలియని నిస్చేతన మైన మస్తిష్కం తో ..
నిశీధి వంతెన పై సుదీర్ఘ ప్రయాణం ….
కారుచీకటి లో కాలమెంత గడిచిందో …
ఒక్కసారిగా వీచిన చల్లని పిల్లగాలి స్పర్శ తో..
ఉలికి పడిన మనసు చైతన్యం నింపుకుంటూ ..
వడి వడి గా అడుగులు కదిపింది …
నిర్జీవం నింపుకున్న కన్నులలో
తారల వెలుగు తళుకు మంది .
చేరువలో ఉషోదయం
భూపాలం తో నిశ్శబ్దాన్ని చేధించింది .
చేతిని చల్లగా ఒక చెలిమి పెనవేసింది..
నిశీధి మళ్లీ నిశ్శబ్దాన్ని వెతుకుతూ వెనుతిరిగింది..విజయ గోలి