తరుణి చదువరైతే…
తరియించును తరాలన్నీ ..
చదువులమ్మ .. అమ్మైతే..
ఆవరణలో విరబూయును
అందమైన ..వసివాడని …
సంస్కారపు ..విరజాజులు .. విజయ గోలి
దగ్గరచేస్తూనే ..బంధాలను దూరంచేస్తున్న ..
సాంకేతిక సాలెగూడు …సంకేతాలకు ..
దాసానుదాసులై ….కుంచించుకు పోతున్న ..
సమాజానికి హస్తభూషణమై అలరారుచున్న ..
అంతస్తుల విలువలు తెలిపే అందమైన చరవాణీలు..
అన్నం లేకున్నా పర్లేదు…
చేతిలోన సెల్లు లేక క్షణ గడవదు …
మనసుకు మరపు చెలిమి కావాలంతే…
లేకుంటే బ్రతుకు బండి సాగదు …అది అంతే …
కాలంతో కరగదీయి ..కష్టమైన నష్టాన్ని …
మనసారా తలుచుకో …మది నిండిన ఇష్టాన్ని ..
మధురమైన జ్ఞాపకాలు మదిని దాటి పోవంతే ..
పదిలమైన పరిమళాలు పరవశింప చేయు…అదిఅంతే …విజయ గోలి
జ్వలిత నేత్రం ..
రుధిరం స్రవిస్తోంది …
మంద్రమైన ..
మలయ పవనాలను ..
చండ్రనిప్పులు చెరగమంటూ..
నిదురిస్తున్న జగతిని ..
జాగృతం చేస్తూ ..
ఉత్తేజపరుస్తూ …విజయ గోలి
అహంకారం
ఆక్రోశం
ఆవేశం
ఆనందం
మనుగడ తెలిపే
మహా నైజాలు..విజయ గోలి .
రాధామాధవ దివ్య ఆరాధన ..
కైవల్యానికి కమనీయ భావన..
ప్రేమకు రమణీయ ప్రేరణ ..