కల కూజితాలతొ

క

కలకూజితాలతో   మౌనాలను…

మంద్రంగా ఛేదిస్తూ …

నీలిమబ్బుల నడుమ ,…

వెండి  సింధూరాలను సంధిస్తూ ..

తొలి వెలుగు కిరణాలతో  …

తెలిమంచు  తెరలను తొలగిస్తూ …

తూరుపు కనుమల సౌధం …నుండి…

కర్మసాక్షిగా ..కర్తవ్య పారాయుణుడై …

సప్తాశ్వరధాసీనుడై…రాజసంగా ….

ఆదిత్యుని ..ఆగమనం …

అందమైన  శుభోదయం ….విజయ గోలి

మౌనం లో కనిపించేంత మంచితనం లేదు ..

అన్యాయం అంటూ తీతువు లా..

గొంతు చించుకుని అరావాలనుకునే …

వెతలు నిండిన ..అంతరంగాల కుత్తుకలను..

కర్కశంగా  కత్తి లాగా ఖండిస్తుంది .. విజయ గోలి

అమ్మతనం నీదంటూ.. కమ్మగా…

బంధాలతో ..బంధించి…వేశారు ..

ఎన్నటికీ  వీడని ..సంకెళ్లు …విజయ గోలి .

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language