కలకూజితాలతో మౌనాలను…
మంద్రంగా ఛేదిస్తూ …
నీలిమబ్బుల నడుమ ,…
వెండి సింధూరాలను సంధిస్తూ ..
తొలి వెలుగు కిరణాలతో …
తెలిమంచు తెరలను తొలగిస్తూ …
తూరుపు కనుమల సౌధం …నుండి…
కర్మసాక్షిగా ..కర్తవ్య పారాయుణుడై …
సప్తాశ్వరధాసీనుడై…రాజసంగా ….
ఆదిత్యుని ..ఆగమనం …
అందమైన శుభోదయం ….విజయ గోలి
మౌనం లో కనిపించేంత మంచితనం లేదు ..
అన్యాయం అంటూ తీతువు లా..
గొంతు చించుకుని అరావాలనుకునే …
వెతలు నిండిన ..అంతరంగాల కుత్తుకలను..
కర్కశంగా కత్తి లాగా ఖండిస్తుంది .. విజయ గోలి
అమ్మతనం నీదంటూ.. కమ్మగా…
బంధాలతో ..బంధించి…వేశారు ..
ఎన్నటికీ వీడని ..సంకెళ్లు …విజయ గోలి .