అక్షరాలతో రంగవల్లి

అక్షరాలతో  అందంగా రంగవల్లులేయాలని ..

అంతులేని..ఆరాటం ..స్పందనలను చుక్కలుగా ..

పెల్లుబికే..భావాలతో .పెనవేస్తూ  కలపాలనివిజయ గోలి.

ప్రతిసృష్టి …….రచన..విజయలక్ష్మి

జీవకణాలతో సృష్టికి  ప్రతి సృష్టి  చేస్తున్న

అపర విశ్వామిత్రులారా !

మూలకణాల తో మృత్యువుకు అడ్డుకట్ట వేస్తున్న

మహా ధన్వంతరులారా !

ముందుగా మానవత్వం పెంచే మందు కనిపెట్టండి

లేకుంటే మీ ప్రతిసృష్టి కి అర్ధమే లేదు .

మారిపోతున్న  మానవత్వపు విలువలు

మలిగిపోతున్న శ్రీగంధం పరిమళాలు ..

అంతరించి పోతున్న అత్యుత్తమ సంపదలు .. విజయ గోలి .

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language