******హిమాలయ పర్వతం నాన్న******విజయ గోలి
గర్జిస్తున్న మేఘంలా గాంభీర్యాన్ని కప్పుకున్న ..
ఎదురులేని హిమాలయ పర్వతం ..నాన్న
బుడి బుడి అడుగుల నడకల వేళ..
తడబడకుండా చేయి పట్టి నడక నేర్పి..
ఉన్నతాశయాలతో తీర్చిదిద్దిన సమోన్నత గురువు ..నాన్న..
అడుగడుగున వెన్నుదట్టి ధైర్యమిచ్చి ..
ఎక్కిన ప్రతి మెట్టుకు చేయూతనిచ్చి ..
భావికి బంగారు బాటలేసిన మార్గదర్శి ..నాన్న..
క్షణ క్షణము కంటికి రెప్పై కాపు కాసిన నాన్నకు ..
వయసు ఉడిగిన వేళ అడుగడుగున నీవిచ్చే ఆదరణే ..అమృతం
పితృదినోత్సవమంటూ ఒక రోజుతో తీర్చ లేని ఋణమిది..
వేయిజన్మలకైనా ..తీరని జన్మ బంధం..తండ్రి బిడ్డల బంధం ..