విశ్వ సుందరి. విజయ గోలి
విశ్వంలో రంగులన్నీ రంగరించి మలచెనేమో విశ్వబ్రహ్మ ..
తాపసులకు తపన నేర్ప పంపేనేమో సృష్టికర్త ..
నీలి మొయిలు నీడలలో …నాట్యమాడు మెరుపు తీగ…
వీడిపోయి విహరించే .. కురుల ఝరులు ..
చల్లగాలికి ..తేలిపోయే ..నల్లమబ్బు సోయగాలు ..
అలవోకగా అలరిస్తూ ..తామరలను ..ఏమార్చు ..కనులు..
మధువు నింపిన ..మధుపాత్రలే ..అధరాలు ..
మయూరాల ..మరిపించే ..హొయలు..తీరు..
రాయంచల ..రాజసం.. తొలిగి దారి నిలిచిపోవు ..
అందాలను వర్ణించగా …ప్రబంధాలే చిన్నబోవు ..
వేయి మాటలేల …వెన్నెలలో ..వెండిపూల జల్లువుగా..
చందమామ నీ అందాలకు దిష్టి చుక్క తానవ్వునుగా !