*మానవత్వమా …నీ మనుగడ ఎటు వైపు..***విజయ గోలి
చిధ్రమైన శరీరంతో కొనఊపిరితో కొట్లాడే..
సాటి మనిషి కి సాయమేదో ఆలోచించని ..నీ మనసు
సెల్లు ఫోన్ క్లిక్ లోగా …ఉపిరిఆగిపోతుందేమో ..
అంతర్జాలంలో అందించాలనే ఆరాటపడుతుంది ..
ఆకలికి అన్నం పెడుతూ ..అప్లోడ్ చేస్తే వచ్చే లైకులపై నీ ధ్యాస
ఒక మేలు వంద కీడులు కాస్తుంది ..
మనసు తోటి చేసే ప్రతి పనికి విలువుంది ..
మంచి పనికి బదులు ..ఎపుడు నీ తోడై ఉంటుంది ..
నీ డి .ఎన్ .ఏ.లో మానవత్వపు మచ్చుకుంది..
మరుగున పడుతున్న దాన్ని ..వెలికి తీయి ..మనిషీ ..
లేకుంటే నీ మనుగడ మారుతుంది .. జీవమున్న.. నిర్జీవిగా ..
విజయ గోలి .