బాల్యం

బాల్యం  విజయ గోలి

చిన్ననాటి జ్ఞాపకాలు ..సిరిచందన పరిమళాలు ..
తలుచుకున్న వెనువెంటనే పెదవులపై విరిహాసం ..
కనుల లోన కనిపించును దీపావళి దరహాసం ..
వెన్నెలలో దొంగాటలు, నీడలతో దోబూచులు .

జడకుప్పెలు ఎగిరేలా ఒప్పులకుప్పాటలు …
చిరుచేతులు కలుపుకుంటూ ..చెమ్మచెక్కలు ..
బొంగరాలు ..గోళీలు ..గోటిబిళ్ళాటలు …
కబడ్డీలు ,..తొండి..మొండి ..తొక్కుడు బిళ్ళాటలు ..

పతంగులు ..పంచుకున్న ..తాయిలాల పసందులు…
ఉసిరిపిందెలతో ఉప్పు కారాల నంజుళ్ళు…
చందమామ ,బాలమిత్ర ..ఒకరికొకరు చెప్పుకున్న …
బాలకాండలు ..కృష్ణ లీలలు ….

ఎన్నటికీ ..మరువలేని …పంచతంత్ర కధలు ..
కల్మషాలు ..లేని .కలిమిలేములెంచని …
కులమతాల కుళ్ళు లేని …అందమైన బాల్యము …
తలుచుకుంటే తనివి తీరని తన్మయము …

ఆరు పదుల వయసు కూడ ఆనందపు ఊయలూగు!
ముక్కుపచ్చలారని మూడేళ్ళ వయసుకే …
బడులలో బందీలుగా బాల్యమే మరిచారు .. నేటి తరం..
మరుగవుతున్న బాల్యం మెరుగవ్వాలని ..
మంచితనం వనంలా పెరగాలని వాంఛిస్తూ…విజయ గోలి .

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language