అద్దం విజయ గోలి
మకిలి పట్టిన అద్దం లో ..
సందిగ్ధం లో ప్రతిబింబం ..
ప్రత్యేక ప్రక్షాళన లోనే స్వచ్ఛత ..
శాంతి కపోతాలకు..
రాబందులు వారసులవుతుంటే ..
అడుగడుగున ..గాడ్సేలు ..
గన్నులతో ..నిలబడితే ..
నిక్కమైన ..నాయకత్వం ..ఎక్కడ .
ఎదుర్కోవటమంటే ..ఎరుపు రంగే కాదు ..
శ్వేత వర్ణం .. సమరంలో.. సమ భాగమే ..
గాలివాటు గమనమేగా సమాజానిది ..విజయ గోలి