శ్రీమల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
సప్తవర్ణాల సింగిడి 2/10/2020
అంశం-:లాల్ బహదూర్ శాస్త్రి
నిర్వహణ-: శ్రీమతి గాయత్రిగారు
శ్రీమతి హరి రమణ గారు శ్రీమతి కవిత గారు
రచన -:విజయ గోలి
శీర్షిక-:చెరిగి పోని సంతకం
ప్రక్రియ-: వచన కవిత
ఒక బాపు ఒక బహదూర్
ఏకమైన మార్గంలో
మమేకమైన భారతం
వందే మన భారతం
శాస్త్రీజీ సమన్వయం
స్వార్ధమెరుగని జీవితం
నిరుపమాన నిర్మితం
పొట్టిమనిషి గట్టితనం
జే జేలు పలికిన భారతం
సాధారణ సౌమ్యవాది
పేదయైన ధనికుడు
దేశసేవ ప్రమాణంతో
ఎగురవేసె రాజనీతి కేతనం
దేశానికి రెండు కళ్ళు
జైజవాన్ జైకిసాన్
నినాదమే పూరించెను
నిడివిలేని పాలనైన
నిరతం ధర్మమార్గ నిర్దేశనం
సరిహద్దుల సమరంలో
సాహసాల యోధుడు
రాజకీయ కుట్రలతో
బలిదానపు బడుగు జీవి
చరితలోన చెరిగిపోని సంతకం
భారతరత్నగ నీ పేరు అజరామరం
అస్తవ్యస్త దేశాన్ని ఆదరించ రమ్మంటూ..
భావితరానికి బాటవేయ రమ్మంటూ
ఆర్తి మీర వేడుతున్నాం ..అమరుడా
అందుకో….జన్మదినం శుభాకాంక్షలు