గజల్…రచన విజయ గోలి
చీకటెనక దివ్వెవుంటె ఎదుటఏదొ ఎరుకపడును
నిన్నునీలొ చూసుకుంటె వున్నదేదొ ఎరుకపడును
ఆశవుంటే తప్పుకాదు అదుపులేక ఏమిబ్రతుకు
పగ్గమేసి పట్టినపుడె ఒడుపుఏదొ ఎరుకపడును
అలలపైన నిచ్చెనేస్తే అందబోదు ఆకాశం
కలలదారి వెలుతురుంటె గమ్యమేదొ ఎరుకపడును
నీతితప్పె చేతలన్నీ నిట్టనిలువు ముంపులేను
కరకుదనము కరగతీస్తె కలిమిఏదొ ఎరుకపడును
సమరమందు సంధికూడ ఒదిగివున్న విజయ* మేగ
ఎదుగుతుంటె మంచిలోని మత్తుఏదొ ఎరుకపడును