శుభోదయం 🌹🌹🌹🌹🌹
మిత్రులందరికీ. శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*బాల కృష్ణుడు. విజయ గోలి
అష్టమి శుభలగ్నమున ..
దేవకి అష్టమగర్భమున
కంసున చెఱశాలన పుట్టి
నారాయణుడే నల్లనయ్యగ
నందునింట జేరె ..ఆనంద కిశోరమై..
యశోదమ్మ ముద్దుల పట్టిగ..
వ్రేపల్లె కనువెలుగాయె యదునందనుడై …
శిఖిన పింఛము తళతళ మెరియగ
దండకడియములు ధగధగ లాడగ
మెడనిండుగ చెంగలువలాడగ
పట్టుదట్టియే పాదములానగ
చిట్టి పాదముల చిరుమువ్వలు…
ఘల్లు ఘల్లుమని సవ్వడిచేయగ
వెదురు వేణువు వేడుక చేయగ..కృష్ణయ్య
ముగ్గుల దిద్దిన ముద్దుల కృష్ణుని….
అడుగుజాడలు వెతుకులాడుతూ…
పుట్టిన రోజున వాకిట నిలచెను …కన్నయ్య …
హారతులిచ్చి స్వాగతించరే…నల్లనయ్యను
గంధములలది పన్నీరు జల్లరే…పరంధామునకు
ఆదరమున ఆసనమివ్వరే..గోవిందునకు..
పాలు వెన్నలు పంచదారలు జుంటితేనెలు..
ఆరగింపుగా అందియ్యరే… అందాలయ్యకు…
గోవర్ధనమెత్తి గోకులము గాచిన గోపాలునకు..
అన్నీ తానై ఆపదలందు ఆదుకోమని…
బాలలందరు బాలకృష్ణుని బహుమతులడగరే…