గజల్- విజయ గోలి
తోటనిండ పువ్వులుంటె అందమేగ
ఇంటినిండ నవ్వులుంటె అందమేగ
బంధమెపుడు ఒంటరైతె బాధలేగ
గూటినిండు గువ్వలుంటె అందమేగ
కుండనిండ బువ్వవుంటె కూరిమేగ
ఊరువాడ పంచుకుంటె అందమేగ
జాతరెపుడు పోతురాజు చిందులేగ
దీపావళి జువ్వలుంటె అందమేగ
ఉరుకులాడు వేగమెపుడు యంత్రమే
పైరగాలి పడుచులుంటె అందమేగ
రచ్చబండ రాచరికం రంగులుగ
రాలుగాయి కుర్రలుంటె అందమేగ
గుడినగంట మ్రోగుతుంటె *విజయ మేగ
కంచిచేరక కధలుంటె అందమేగ