విజయ గోలి గజల్
అక్షరాలే బందీఅయితె అంధకారమే అవనిలోన
చైతన్యమే చిదిముతుంటే అహంకారమే అవనిలోన
బలమేలేని కలాలతోటి కవనసేద్య కాలమంతమె
నిరక్షరాలే నిత్యమైతే అనాగరికమే అవనిలోన
జ్ఞానదీపం ఆర్పివేస్తే మేధస్సులకు మెరుపులెక్కడ
విషబీజాలే మొలకెత్తితే వినాశనమే అవనిలోన
ఉద్యమించే గళాలందున ఉద్రేకములే వీగిపోతే
జిజ్ఞాసువులా దారివెంటన ఆక్రందనమె అవనిలోన
ఎలుగెత్తుతే వెనుకవచ్చును తూణీరాలె విజయబాటన
భావాలలో భాషలూరితె ఆనందమే అవనిలోన