*జీవితం *గజల్ విజయ గోలి
కోరినదే జీవితం ఇవ్వదుగా ఎవ్వరికీ
బాధలేక సంతసమే పంచదుగా ఎవ్వరికీ
నవ్వుతున్న కళ్ళవెనుక నడయాడే నీడలుగా
గుండెచాటు గుబుళ్ళనే దాచదుగా ఎవ్వరికీ
అనుభవాల లోతేమిటొ ఆచూకీ లేదుకదా
శతకాలతో మేధస్సులు మెరవదుగా ఎవ్వరికీ
వేటలోని వేడుకలే మృగరాజు దరహాసం
జింకపిల్ల వెతలేమిటొ తెలియదుగా ఎవ్వరికీ
ఎగిరివచ్చు రాళ్ళనే గోడలేప విజయ మేగ
తూటాలకు బీటలేవి పడలేవుగా ఎవ్వరికీ