గజల్ విజయ గోలి
విద్వత్తును విశ్వమంత పంచుతుంటె సంతోషం
మహత్తులనె మదినిండుగ దాచుకుంటె సంతోషం
అనుభవాలు వల్లెవేసె దారులలో నడవాలిలె
గురుతువెనుక గుబులుందని తెలుసుకుంటె సంతోషం
చద్దిమూట చుట్టరికం ఊరగాయ ఉచితమేలె
ఊటబావి తీయదనం ఊరుతుంటె సంతోషం
బీరపాదు పచ్చదనం ఎండకుంటె పండుగలే
గుచ్చుకునే బంధాలను తెంచుకుంటె సంతోషం
హృదయాలు విస్తరిస్తే వివరాలతొ పనిఏమిటి
అందినంత విజయా లను అందుకుంటె సంతోషం