ఆస్తికుడు -విజయ గోలి

చుక్కలతో పోటీపడుతూ ..
కలువలైన కార్తీకదీపాలు ..
కమనీయ కాంతులతో ..
వెలుగుబాట నిర్దేశిస్తూ ..
వెలుగుతున్న వేడుకలు
తళుక్కుమంటున్న మెరుపుల
తరంగాలలో శివోహం అంటుూ
హోరెత్తిస్తున్న ఓంకారాలను ..
కనులవిందుగా కంటున్నపుడు …
రామరాజ్యం రాజ్యమేలుతుందని …
నా కనులపై నేనే పరదా వేసుకుంటున్నా..
వరదలై పారుతున్న పంచామృతాల్లో …
పట్టెడన్నం కోసం పరుగులు పెట్టే
వసివాడిన పసిముఖాలు ..
తొంగి చూస్తున్నా ..మనసు నుండి ..తొలగిస్తూ ..
నా కనులపై నేనే పరదా వేసుకుంటున్నా…
సౌలభ్యం తెలియని ..ఆస్తికుడిని.
భయంతో భక్తి వెనుక పరుగెడుతున్న… స్వార్ధపరుడిని .

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language