శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
అక్షరాల బంధమంటె చైతన్యపు రూపమేగ
క్షరములేని అక్షరమే సాయుధ్యపు రూపమేగ
జ్ఞానజ్యోతి కిరణాలతొ నిండివున్న అఖండమే
మేధలనే మేలుకొలుపు ఉషోదయపు రూపమేగ
భావాలను కవనములుగ కదిలించెడి కరములేగ
భాషలోని బంధాలకు మాధుర్యపు రూపమేగ
ఆవేశం ఉరకలేయు అక్షరములె అణుబాంబులు
ఉద్యమాల ఊపిరులకు ఆయుధ్యపు రూపమేగ
వాగ్దేవీ వర్ణమాల విరజల్లిన విజయాలే
శ్రీ వాణీ పూజలలో ప్రాముఖ్యపు రూపమేగ