విజయ గోలి గజల్
చేసుకున్న బాసలలో బలమేమిటొ చూస్తున్నా
పెంచుకున్న ఆశలలో ప్రేమేమిటొ చూస్తున్నా
సాగుతున్న మేఘాలను తొందరేల ఆగమన్నా
సందెవేళ సందేశం కధఏమిటొ చూస్తున్నా
కారడవిలో మిణుగురులే కాగడాలు కాంతిపంచ
నిశీధిలో వెలుగుతోడు విలువేమిటొ చూస్తున్నా
మబ్బుచాటు చందమామ అంబరాన సంబరమే
క్షణికమైన చలనాలతొ చెలిమేమిటొ చూస్తున్నా
అద్దములో కనిపించని అందమొకటి విజయమేలె
మల్లెలాగ పరిమళించు మనసేమిటొ చూస్తున్నా