నా కల …నా స్వర్గం విజయ గోలి
అది ఒక ప్రశాంత పర్ణశాల ..
అక్కడ నా భావాలు మాత్రమే పరిమళిస్తాయి
అక్కడ నా పదాలు మాత్రమే పల్లవిస్తాయి
కాలుష్యమే లేని కవన పవనాల…
పన్నీటి పలుకరింపులు మాత్రమే ఉంటాయి
చెంగల్వలంత స్వచ్ఛ మైన చెలిమి మాత్రమే అక్కడి కలిమి
పువ్వులు లాంటి నవ్వులు తప్ప నటనలుండవు
అక్కడి వెండి వెన్నెలలు వేణు గానాలు నాసొంతం
ఎవరైనా నా ఆవరణలోకి రావాలనుకుంటే.
పాదరక్షలు బయట విడిచి రండి..
దయచేసి నా కలని కబ్జా చేయకండి