అందినంత ప్రేమలనే

ఒక హిందీ గజల్ మూలంగా ..ప్రయత్నం
అనువాదము మాత్రం కాదు..భావాన్ని మాత్రమే
మూలంగా తీసుకున్నాను…
మిత్రులను స్పందన తెలుపవలసినదిగ కోరుతున్నాను🙏🏻🙏🏻

విజయ గోలి. గజల్

అందినంత ప్రేమలనే పంచుకున్న జ్ఞాపకమే
కడలినంత కన్నులలో దాచుకున్న జ్ఞాపకమే

తొలిసారిగ నాకన్నుల నిలచినదే నీరూపము
మునిపంటిన నడమివేలు కొరుకుతున్న జ్ఞాపకమే

హేమంతపు సంధ్యలలొ దాగిదాగి వేచినదే
ప్రేమనంత గుండెలలో నింపుకున్న  జ్ఞాపకమే

చెలిమిలోని చెరుకుతీపి మరువలేని మధురగీతి
ప్రాణాలతొ ప్రమాణాలు చేసుకున్న జ్ఞాపకమే

గుండెచిదిమి  గురుతులనే గునపాలతొ గుచ్చినదే
రుధిరంలో మల్లెపూలు విచ్చుకున్న జ్ఞాపకమే

మెహఫిల్ లో మందాకిని మంజీరం సవ్వడులే
ఖవ్వాలీల కధనాలలొ పాడుతున్న జ్ఞాపకమే

నీచూపే విజయ మైతె ఎప్పటికీ అదినాదే
తొలిచూపుల ఛద్దర్ నే కప్పుకున్న జ్ఞాపకమే

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language