విజయ గోలి గజల్
చుక్కలంట చూడబోకు చెలిమికోరి చెలికాడా
దిక్కులంట వెళ్ళబోకు కలిమికోరి చెలికాడా
గుండెలలో గూడుకట్టా గుట్టుగానె ఉండిపోర
ప్రేమదారం కట్టానుగా మదినికోరి చెలికాడా
మనసుతెలిసి కలిసిపోర ఆయువులో వాయువుగా
కంటినిండ నిలిచిపోర కాంతికోరి చెలికాడా
రాసుకున్న రాతలనే గీతదాటి పోనీయకు
చేతిలోన చెయ్యివేస చేరికోరి చెలికాడా
బ్రహ్మముడి విడతీయగ సమ్మతమే కాదెపుడు
“విజయ మెపుడు ఇద్దరిదీ నియతికోరి చెలికాడా