పిచ్చుక

పిచ్చుక..పై ..బ్రహ్మాస్త్రాలు ..
కాలుష్యపు కడలిలో …
కరిగిపోతున్న ప్రకృతి బంధుగణం ..
అంతరించి పోతున్న అందమైన జాతులు
చరవాణి సాంకేతిక స్తంభాలు ..
విహంగాల దారిలో ఉరి కంబాలు .

ప్రతి ఇంటి బంధువుగా …
ప్రతి రైతు నేస్తంగా …
పలుకరించే పిచ్చుకమ్మలు..
అమ్మ తెచ్చే గింజకోసం ..
ఆవురంటూ ఎదురుచూస్తూ ..
కిచ కిచలతో అలరించే చిన్నిపిట్టలు ..
ఇక చరిత్రలో …మిగిలిపోయే చిత్రాలు ..విజయ గోలి .

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language