*ఒకే గూటి గువ్వలు*
విజయ గోలి
ఒకేగూటి గువ్వలమై
ఒక్క తీగ పువ్వులమై
అమ్మ చాటు బిడ్డలమై
నాన్న కంటి మెరుపులమై
కన్న ఇంటి దివ్వెలమై..
కలకాలము వెలుగుదాము.
గాలి గంటల సరిగమలు
అల్లరి ఎంతో మధురములు
తగవులు ఆడిన తరుణంలో
తబలా దరువులే తనువులు
ఆవరణంతా అలుపెరుగని
చేతికి అందని పరుగులు
ఆవకాయ ముద్దలతో
వెన్నకలిపి సుద్దులనే
ముద్దలగా అందించిన
అమ్మప్రేమ అతిమధురం..
నాన్నంటే చిట్టడవి సింహమే …
చెవులపిల్లి చిందులేగ చిన్నారివి
ఎంచుకున్న దారులలో
ఎంత దూరమెళ్ళినా
గూడులిపుడు వేరైనా
మన గుండె సవ్వడి ఒకటేగ
ఏనాటికి ఒకే గూటి గువ్వలమేగ