విజయ గోలి గజల్
ఆశల నెగళ్ళు వేసవి లాగే వెచ్చగ వుండాలి
ఆమని చిగుళ్ళు అల్లరి చేస్తూ పచ్చగ వుండాలి
గూటిన గువ్వలు కువకువ మంటూ కులుకుతు ఉంటే
రెక్కల చప్పుడు ఎప్పుడు చూడూ జంటగ వుండాలి
పిలుపులు ప్రేమగ పిలుస్తు ఉంటే పలుకని దెవరో
గుండెను గుచ్చక గురుతులు ఎంతో తీయగ వుండాలి
మేఘము చాటున మెరిసిన తీగకు కుదురే లేదుగ
చినుకుల తడిచిన నేలను పంటలు చక్కగ వుండాలి
నేనును మరచితె మనుగడ లోనా మనమే ఘనముగ
*విజయము వెనుకన విలువలు అంతా మెచ్చగ వుండాలి