* వాదులాడ వేడుక విజయ గోలి
వేచిచూసి వేసారితి వలదు వలదు
వాదనేల నాతోడ వాదులాడ వేడుకా
తగదు నీకిది నాపై తగవులాడగా
తగవైన వగపైన తలపున నీవేకద కన్నా
ఓరిమి లేనిదాన కూరిమి చూడవేమి
సహనమున సరిహద్దులందువేమి
చిలిపిచేతలాపి చింతదీర్చ చేరవేమి
కోరి చేరి పిలిచానని అలుసు చేయకు కన్నా