విజయ గోలి గజల్..
మూసివున్న కన్నులలో దాగివుంది ఒకవేడుక
విచ్చుకున్న రెప్పలపై వేచివుంది ఒకవేడుక
చిరునవ్వుల చెక్కిలిపై నొక్కులనే చూడాలని
నుదుటిపైన చిరుముద్దుగ కోరికుంది ఒకవేడుక
ముక్కుపైన ముచ్చటగా తళుకుమన్న ముద్దులేవొ
ఉప్పెనలో మునిగిపోను వేడుకుంది ఒకవేడుక
శిగపాయల సిరిమల్లెల కోరికలో చిగురింతలు
చిరుచెమటల చెమరింతల ఆడుతుంది ఒకవేడుక
వేణువునే వేడుకుంది మోహనమే మీటమంటు
కన్నయ్యతొ కలబోతలొ *విజయముంది ఒకవేడుక