
*పక్షికన్ను*. రచన -: విజయ గోలి
విజయానికి ప్రయత్నమే విసిష్ఠ ఆయుధం
పడిలేచిన ప్రతిసారి పదును తేలుతుంది
చిత్తశుద్ధి తో సంకల్పిస్తే తప్పనిదేగ గెలుపు
ఒలికిన సిరా మరక చరిత్ర సృష్ఠించే చిత్రం కాక తప్పదు
బలహీనతలో బలం,నిరాశలో ఆశ ,మిణుగురులో మెరుపు..
పక్షి కన్ను మాత్రమే ….సవ్యసాచి లక్ష్యం ..అదే ఆదర్శం
మింటి చుక్కను ..కంటిచుక్కతో శోధించిన కొలంబస్ దే గెలుపు
కష్టాన్ని ఇష్టంగా మలుచుకుంటే అందని ద్రాక్షలే ఉండవు