కాంతి రేఖ 🌹🌹

*కాంతి రేఖ * విజయ గోలి 🌹🌹🌹🌹🌹

తిరోగమిస్తున్న అడుగులు
తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి ..
కనుల కొలనులో నీరింకి పోతుంది ..
ఆశలు అడుగంటిపోతున్నా
వెన్ను తడుతున్న ఆత్మవిశ్వాసం

వెతలు వెళ్లబోసుకునేందుకు ..
కాలమాగటం లేదు .
మనసు నింపుకున్న ఆశలు..
కనులు ప్రతిఫలిస్తున్నాయి ..
కనులకంటుకున్న కలలకు..
చైతన్యపు దరి చూపాలనే …
మస్తిష్కం మౌన విహంగమై ..

తేలిపోతున్న తెల్లమేఘాలకు
నీలిరంగును అద్దుతుంది ..
ఎండమావుల నీటితో
ఎసరు పెట్టె ఆలోచన …ఎంతకాలం ..

ఆశల పంట పండేదెపుడో …అవగతమే లేదు …
కారు చీకటిలో చుక్క వెలుగే కాంతి రేఖ ..
గెలుపోటములు ఆవలిగట్టు …
ప్రయత్నమే విజయానికి తొలిమెట్టు …విజయ గోలి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language