చినుకుపూల జల్లు

చినుకుపూలజల్లు*🌹🌹🌹🌹విజయ గోలి

వేసవి సరదాలపై నీలి పరదాలను పరిచి ..
తొలి చిగురుల మాటునుండి ..
చిరుగాలి ..మోసుకొస్తున్న ..
తొలకరి జల్లుల ..పరిమళాలు..
గట్టి జ్ఞాపకాలని …తట్టి లేపుతున్నాయి…

నడిఝామున వరుణుడి ఆదరణ …
తట్టుకోలేని తరువులన్ని ..
తడిచిముద్దయిన …తరుణులల్లే ..
శిరస్సు వంచి ..సిగ్గు ముగ్గులేస్తున్నాయి ..
మౌనాలకు మాటలు నేర్పిస్తూ …
దూరాలను చేరువ చేస్తూ..
మధురాలను .. మననం చేస్తున్నాయి..

సృష్టిలోని ..వర్ణాలన్నీ రంగరించి …
పుడమి పైని రంగవల్లులల్లినట్లు ..
రమణీయమైన రంగుల తివాచీ పరచినట్లు ..
అడుగడుగున చినుకుపూలు జల్లి..
అవని పైకి ఆనందాలను ఆహ్వానిస్తున్నాయి ..విజయ గోలి .

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language