బదులడగని బహుమతి.

*బదులడగని బహుమతి. 🌹🌹 🌹🌹🌹విజయ గోలి🌹🌹

ప్రతి ఇల్లు కోవెల ఐతే
వెలసిన ఇల్లాలే దేవేరి
ప్రతి ఇంటను నిండుగా.
ఆవరణలో తులసిగా..
వెలుగుపంచు వెన్నెల దీపం

అనుబంధాల పందిరికి
ఆత్మీయ ఆధారం
అమ్మగా అత్తగా
కూతురుగా కోడలిగా
వలపుల చెలిగా

మురిపాల చెల్లిగా
ముంగిట రంగవల్లిగా
పూనవ్వుల తావిగా
భిన్నత్వంలో ఏకత్వం
ఏడడుగుల బంధం

సంసార రధానికి
సామరస్య సారధిగా…
సాంగత్యపు వారధిగ
సంతానపు సంరక్షణలో
సంస్కారపు పెన్నిధిగా

ఒదిగున్న ఓర్పుగా
విధులందున విమలగా
సాటి రాని మేటి తాను
గృహసీమకు సామ్రాజ్ఞి
బదులడగని బహుమతి
సిరి నగవుల శ్రీ మతి..🌹🌹🌹

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language