విజయ గోలి. గజల్
జ్ఞాపకాలు అలసిపోతె మనసుకింక మనుగడేది
వ్యాపకాలు ఆగిపోతె మనిషికింక మనుగడేది
మరుగైనది మానవత్వం నిలపకుంటె విలువెక్కడ
పరిమళాలు లేక విరుల సొగసుకింక మనుగడేది
బందీగా నిలవకుంటె బంధమెలా నిలుచునులే
మాటలేక మనసుతోటి మనువుకింక మనుగడేది
జీవితాన తెగువలేక తేలిపోతె గెలుపెక్కడ
అంధుడిగా ఆగిపోతే. అడుగుకింక మనుగడేది
యుగళగీతి పాడుకుంటె అందలేని *విజయ మేది.
మౌనివైతే పొంగివచ్చు. మమతకింక మనుగడేది..