సందె వెలుగు అందం

శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల*

**సందె వెలుగు అందం      విజయ గోలి

పాలకంకి బరువుతో
పైరుతల్లి అందం..
పచ్చగడ్డి మోపుతో
పల్లెపడుచు అందం

పడమటింట సూరీడు
అగ్గిపూల అందం
సింధూరం మెరిసినట్లు
కన్నెబుగ్గ చందం

ఆలమంద బాటలలో
అదలింపులు అందం
పాలెగాడి గొంతులో
పారాడిన పల్లె పదం

ఏటిగట్ల చెట్లవాలు
పాలపిట్ట పకపకలు
గూడు చేరి గుసగుసల
గువ్వ జంటలందం

ఊరిబావి ఊసులతో
ఊరంతా ఘుమఘుమలు
సందెపొద్దు అందాలు
పల్లెవెలుగు చందాలు

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language