ఆకాశం అంచులపై ఉన్నాము
పాలపుంత దారికాదు…
చీకటి వలయం లో …
చిక్కు ముళ్ళు వేసుకున్నాము
కష్టమైనా ఇష్టంగానే
క్షితిజం లో హర్మ్యాలు కట్టాం
మాటాడే మనసును ..
మత్తులోన జో కొట్టాం
తెలియకనే వచ్చిన రెక్కలు
కోరకనే మొలిచిన కొమ్ములు
మూసుకున్న కనులపై
మనకు మనం కట్టుకున్న గంతలు
చుట్టు వేసుకున్న కంచెలు
వేరు చేసిన ముళ్ళు …
మళ్ళీ మళ్ళీ దారిలోనే
పరుచుకంటున్నాము ..
నెత్తురోడుతున్న పగుళ్ళతో నెర్రులిచ్చిన
దారిన జీవితం ఎలా సాగేను !!