జీవితమంటే ఏమిటో …
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది …అందుకే
కలల నుండి మెలుకువ లోకి వస్తున్నాను
అప్పుడు ఆకాశం లో
నా అడుగులు తేలేవి …ఇప్పుడు
పుడమిపై పాదం మోపుతున్నాను
ఇప్పుడు పుస్తకాలతో
అక్షరాలతో పని లేదు
ముఖాలను చదవటం నేర్చుకున్నాను
చుట్టు ముట్టిన శబ్దాలతో
అలిసిపోయి నప్పుడు …
నిశ్శబ్దంతో మాట్లాడటం మొదలెట్టాను
మారి పోతున్న లోకం చూసి
మనసులో అలజడి …అందుకే
నన్ను నేనే మార్చుకుంటూ నడుస్తున్నాను
విద్వేషమనే విషం ఎందుకిలా..
ప్రపంచమంతా ఆవరించుకుంది ..
ఈ విషానికి విరుగుడు ఆలోచిస్తున్నాను
ఎవరు నాతో అడుగు
వేసినా వేయకున్నా…ఇప్పుడు
- నా ఆశయం ఆయుధంగా సాగాలనుకుంటున్నాను