గాయాల దారిలో గేయమై పోయాను
రాగాన్ని వెతుకుతూ రాయినై పోయాను
చింతలో చిరునవ్వు కాంతిగా నిలిచాను
మబ్బులో మలిగి నే మాయమై పోయాను
పుడమిపై పున్నమిని నమ్ముకుని పిలిచాను
నీటిపై రాతలకు అమ్ముడై పోయాను
గుండెలో గుర్తులే కన్నీటి యమునగా
కడలిలో కలిసి నే కాలమై పోయాను
ఏడేడు జన్మలకు ఎనలేని విజయమై
కన్నయ్య చరణాల కావ్యమై పోయాను !!