శుభోదయం 🌹🌹🌹🌹🌹
ఆత్మీయ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐💐💐
గజల్. విజయ గోలి
చిగురించే ఆశలతో హసితాలకు స్వాగతం
వేధించే వెతల నొదిలి వేడుకలకు స్వాగతం
కాలచక్ర గమనంలో క్రొత్త పాత కలయికే
నయా సాల్ నాందిగా నవ్యతలకు స్వాగతం
సంకల్పం సంధించే శరమైతే…విజయమే
నిత్యంగా నిలిచిపోవు సాధనలకు స్వాగతం
ఊసుపోని బాసలతో ఊరిబావి ఊసేల
స్ఫురణలలో స్ఫూర్తి పొందు స్పందనలకు స్వాగతం
సానుకూల సద్భావన నింపుకుంటు సాగుదాం
నవ్య వర్ష శుభమస్తుల గుచ్ఛాలకు స్వాగతం
2022 ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవాలతో ముగిసింది.
2023 సరి క్రొత్త సంవత్సరానికి కోటి కోరికలతో స్వాగతం చెప్పుకుందాం ..
గత సంవత్సరంలో అందరం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ .మన వలన ఎవరైనా బాధ పడినా .మనం ఎవరి వలన బాధ పడినా వాటిని ఆలోచనలనుండి తప్పించి , ముందు ముందు సమన్వయంతో ఉండాలనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా వేసే అడుగులు నిజాయితీ , నిబద్ధతలతో వుండాలని ప్రతి ఒక్కరు కోరుకుందాం .
నూతన సంవత్సరం 2023 అందరికీ ఆనందం కలిగించాలని ,
ప్రతి ఒక్కరు చెడును వీలైనంతగా చెరిపివేస్తూ మంచిని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ.అందమైన ఆశలను ఆశయాలను ఆచరణలకు జోడించి,మంచి ఆరోగ్యాలతో..మానవత్వాన్ని మరిచి పోకుండా సంబరాలతో సంతోషాలతో …అభివృద్ధి పధంలో అడుగు ముందుకేయాలని కోరుకుంటూ
ఆత్మీయ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .
విజయ గోలి