శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
రేయేమో నిలిచిపోయి రెప్పలలో దాగినదీ
ఏమైనదొ హృదయంలో కల వరమై కదిలినదీ
చక్కనైన చుక్కలలో చందమామ చిక్కెనులే
ఎడతెగనీ రాతిరిగా కిన్నెరలే మీటినదీ
విరులతేరు పిలిచినదీ విరపూసిన స్వప్నంగా
తేనెవాన జల్లులలో మరుమల్లియ నవ్వినదీ
నునుసిగ్గుల మొగ్గలేవొ మేలిముసుగు దాగిపోయె
కనులెదుట పల్లకీలొ ప్రణయాలే మోసినదీ
అరుదెంచే ఆమనికై సన్నాయీ స్వాగతాలు
సుమశరముల సమరంలో విజయాలే కోరినదీ!!