శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
నిండుకడలిన నీదు రూపం చందమామగ తోచింది
తీరమంతా ఒలకపోసిన వలపు సుధగా మారింది
మాఘ పున్నమి మధురమవ్వగ మనసు నిన్నే కోరింది
ప్రేమ సౌధం తలపు తెరలను తెరిచి నీకై వేచింది.
వెలుగు తాకగ వివశ మయ్యే వేడుకెంతో బాగుంది
చిగురు చివరల మంచు చుక్కల మౌనరాగం పాడింది
గుబులు గుండెల గునుపు ఏమిటొ గురుతు తెలియక దాగింది
గుట్టు విప్పిన చప్పుడేదో హృదయ లయలో మ్రోగింది
అంకురించే ప్రేమ లతలకు అంతమన్నది లేదులే
చెలిమి పాడే చక్రవాకం విజయ వీణను మీటింది!!