శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
పూరేకులు విచ్చినట్లు ఆ పెదవుల నగవేమిటొ
కలువ రేకు తీర్చినట్లు ఆ కన్నుల సొగసేమిటొ
చిత్రమేమొ… ఆ గళమే గాంధర్వపు గానమాయె
రాశి పోసిన లావణ్యం రాగ సుధల రచనేమిటొ
నల్ల మొయిలు కదలికలా నజాకత్ నడక చూసి
అలిగేనులె రాజహంస …ఆ విజయం పేరేమిటొ
చిరుగాజుల సడి జతలో చిరుమువ్వల సవ్వడికీ
చిరుగాలికి తాళమేయు నీలికురుల చెలిమేమిటొ
మృగనయనీ …వేయకులే వాలుచూపు వలపు శరం
రారాజుల ఓటమిలో… చెలితూపుల గెలుపేమిటొ!!