నిన్న శనివారం ఉదయం రోజు మిత్రురాలు ,గజల్ కవయిత్రి శ్రీమతి విజయ గోలి గారి రెండు తెలుగు గజల్ పుస్తకాలు; “ పిల్లన గ్రోవి”, “ చిత్ర వీణ”
ఆవిష్కరణ సభ జుబ్లీహిల్స్ క్లబ్ banquet hall లో జరిగింది. ఆ సభలో విశిష్ట అతిధిగా పాల్గొని నేను చాల సంతోషించిన దినం.
విజయ గోలి గారి గజళ్ళను నేను Face Book లో
చూస్తూ తన గజల్ ప్రేమికురాలనయ్యాను.
తనగజళ్ళు సున్నిత , సౌకుమార్య ,సౌందర్య పదబంధాలతో ,గజలియత్ లతో అలరిస్తాయి.
“మీ గజల్ సంకలనాలు తేవాలి విజయా “అని
నేను తనతో ఎపుడూ అంటూఉండేదానను.
వారి ఈ రెండు గజల్ సంకలనాలు ఒకే మారు ఆవిష్కరణ జరగడం నాకేంతో సంతోషాన్నిచ్చింది.
సభ ఆద్యాంతము కళారత్న బిక్కి కృష్ణగారి అధ్యక్షతన 2గంటల పైన ప్రముఖ గజల్ కవులు-
హృద్యమైన మెుదటి తెలుగు గజల్ సంకలనాన్ని తెచ్చిన సురారం శంకర్ గారు ముఖ్య అతిధిగా వారి సందేశాన్నివ్వడం మేము గజల్ కవులు / ప్రేమికులు ఎంతో ఆనందించిన కవిసమయం. ప్రముఖ గజల్ కవయిత్రి రాజావాశిరెడ్జి మల్లీశ్వరి గారు “ పిల్లనగ్రోవి “ గజల్ సంపుటాన్ని, కవయిత్రి సుమనా ప్రణవ్ గారు “చిత్రవీణ” సంకలనాన్ని హృద్యంగా విశ్లేషించారు.
ఇతర అతిధులం నేను, మౌనశ్రీ మల్లిక్ గారు విజయ గోలి గజల్ సంకలనాలపై మా హృదయస్పందనను తెలపడం జరిగింది.
రెండు గజల్ సంకలనాలకు కవర్ పేజి ,లోపలి గజళ్ళకు అనువుగా అద్భుతంగా చిత్రాలను వేసిన ప్రఖ్యాత చిత్రకారులు”కూచి” ( కూచి సాయిశంకర్ )గారు మాట్లాడారు. అధ్యక్షులు కృష్ణ గారు మధ్యమధ్యలో విజయ గోలి గారి 4/5 గజళ్ళను పాడి వివిధ కోణాల్లో ఆ గజళ్ళ సౌందర్యాన్ని గురించి సభికులకు విశ్లేషించి చెప్పడం ఆకట్టుకుంది .
ఈ ఆవిష్కరణ సభలలో మధ్యమధ్యలో గజల్ గాయకుడు ఆనంద్ గారు అధ్బుతంగా విజయ గోలిగారి 3 గజళ్ళను స్వరపరిచి గానం చేయడం
విశేషం.
వివిధ మాధ్యమాల్లో , సాహిత్య సాంస్కృతిక సభలలో గజల్ గాయకులు పాడడం ఊపందుకోవాలని నా కోరిక. ఇందుకు తెలుగు గజల్ కవులు తమ గజళ్ళను స్వరపరిచి మంచి గాయకులతో గానం చేయించి You Tube , మరి ఇతర మాధ్యమాల్లో పెట్టడం, సాహితీ, సాంస్కృతిక
సభలలో గానం చేయడం వల్ల తెలుగు గజళ్ళు
విశ్వ వ్యాప్తికి దోహదపడుతుందని మనమందరం గమనించి ఆ దిశగా నడవాలని “విశ్వపుత్రిక గజల్ ఫౌన్డేషన్”VGF ఆశయం,మా కోరిక.
ఉర్దూ , హింది గజళ్ళ లాగా తెలుగు గజళ్ళు ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళాలంటే తెలుగు గజళ్ళలను స్వరపరిచి పాడి సోషియల్ మీడియాల్లో పెట్టడం, తెలుగు గజల్ విభావరుల ద్వారా ప్రజల్లో కి తీసుకుపోవడం
చాల ముఖ్యమయిన కార్యక్రమమన్నది నా ప్రగాడ ఉద్దేశం.
తెలుగు గజల్ కవులను ప్రోత్తహించాలని , తెలుగు గజళ్ళను విశ్వవ్యాప్తి చేయాలనే లక్ష్యంతో నేను, ( అధ్యక్షురాలుగా)కళారత్న బిక్కి కృష్ణ గారు ( ప్రధాన కార్యదర్శి) గా “విశ్వపుత్రిక గజల్ ఫౌన్డేషన్” (VGF)ను 2021 Feb. లో ఆవిష్కరణ జరిపి ,VGF WhatsApp Group పెట్టాము. ప్రస్తుతం దాదాపు వందకు పైగా గజల్ కవులు, గజల్ ప్రేమికులు ఉత్సాహంతో తెలుగు గజళ్ళను
నేర్చుకుంటూ WhatsApp group లోpost చేస్తూ
పరస్పరం చర్చించుకుంటూ అభినందన తెలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ క్రమంలో గజల్ కవులు తమ సంకలనాలను ఆవిష్కరించడం మాకెంతో ముదావహం.
VGF ఆవిష్కరణ తరువాత (అంటే 2021 Feb. నుండి )దాదాపు 12 గజల్ సంకలనాలు వెలువడ్డాయి . నావి -2, బిక్కి కృష్ణ -2, వాసిరెడ్డి మల్లీశ్వరి -3, గడ్డం శ్యామల-1 ,రఘువీర ప్రతాప్ -1,
సుమన ప్రణవ్-1,ఇపుడువిజయగోలి-2,
VGF వార్షికోత్సవ సభలో విజయవాడలో,2022 Feb.) లో “గజల్ మెహఫిల్ “ అని
దాదాపు 68 మంది గజల్ కవుల రెండు గజళ్ళను
తీసుకుని VGF ప్రచురణగా ప్రచురించి ఆవిష్కరణ జరిపాము.(నేను, బిక్కి కృష్ణ గారు సంపాదకులగా మా గజళ్ళను వేయలేదు). ఇంకా చాల మంది గజళ్ళను అధ్భుతంగా రాస్తున్నరు అందులో మహిళలు కూడా ఎక్కువగా పాల్గొనడం ఒక మంచి సంకేతం. వీరంతా కూడా తమ గజల్ సంపుటాలను ప్రచురించాలని ఆశిస్తున్నాము.
తెలుగు గజళ్ళ ను రాయడానికి ,ప్రచురించుకోడావికి
కవులు వెనుకాడే పరిస్థితి నుండి కాపాడి ప్రోత్సాహించాలన్ని సదుద్దేశంతో ప్రాంత , కుల,మతాల కతీతంగా మేము నెలకొల్పిన “ విశ్వపుత్రిక గజల్ ఫౌన్డేషన్“ ఆశయాలు నెరవేరుతున్నాయనడానికి ఈ గజల్ సంపుటాల ఆవిష్కరణ , గజల్ గాన ఆడియో వీడయోలు రావడం నాకు , బిక్కి కృష్ణ గారికి ఎంతో ఆనందాన్నిస్తూంది.
నిన్నిటి విజయగోలి గారి సభను ఎంతో అద్భుతంగా
జరిపి, అతిధి లను సత్కరించి , ఆహూతులకు మధ్యాహ్నం భోజనం పెట్టి తమ తల్లి గారు విజయ
గోలి కుమార్తెలు, అళ్ళుల్లు , (భార్ఘవి, రాజేష్ గార్లు& బాంధవి కుమార్ గార్లు)మనవడు,మనవరాలు, బంధుమిత్రులను నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను .💐👏👌❤️
మిత్రులకోసం లభించిన కొన్ని ఫోటోలు