శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
కన్నీటికి భాష వుంటె కధలెన్నో చెప్పుతుంది
తడి కన్నుల తపనలలో వెతలేమిటొ తెలుపుతుంది
దూరాలే భారమైన నీతలపుల జతలోనా
గూడు కట్టి మనాదిగా గుండె లోన సలుపుతుంది
మౌనంగా మనసు భాష ఒలికించిన ముత్యాలతొ
కనుల కాంతి పెదవులపై పగడాలుగ మారుతుంది
కలల నీడ నీతోడుగ నడుచుటెలా తెలియ కుంది
రెప్పమూస్తె కాలమాగి పోవుననే భయముంది
ఎదురుచూపు ఎద వాకిట విరహమెంత ఓపనిదో
నుదుటి మీద ప్రేమరాత విజయాన్నే కోరుతుంది