శుభోదయం 🌹🌹🌹🌹🌹

మిత్రులకు నమస్సులు……..
నిన్న 19/11/22 శనివారం విజయవాడ ” తుమ్మలపల్లి కళాక్షేత్రంలో” మల్లెతీగ పత్రిక సంపాదకులు ” కలిమి శ్రీ” గారు ఏర్పాటు చేసిన ” జాతీయ సాహిత్య, సాంస్కృతిక సమావేశాలు జరిగాయి .అందులో నేను కూడా పాలు పంచుకోవటం జరిగింది .
కలిమి శ్రీ గారు. ప్రత్యేకంగా తెలుగు గజల్ సాహిత్య ప్రక్రియ కోసమే ఒక కార్యక్రమం రూపొందించారు

ఈ సందర్భంగా మాస్ట్రొ డా// గజల్ శ్రీనివాస్ గారు, డా// రెంటాలగారు ప్రముఖ సినీకవి రసరాజు గారు ,ప్రముఖ గజల్ కవి శ్రీ సురారం శంకర్ గారు ,డా// గజల్ కవయిత్రి యంబిడి శ్యామల గారు , ప్రముఖ గజల్ కవి, డి.రామశర్మ గారు డా//రమణ యశస్వి గారు వంటి గజల్ సాహిత్య దిగ్గజాలతో వేదిక పంచుకోవటం జరిగింది .కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది . కవులందరూ గజల్ మీద చక్కని అవగాహన కల్పించే ప్రసంగాలు చేసారు.

ముఖ్యంగా “గజల్ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా రాయాలో, ఎలా రాయకూడదో వంటి అతి సున్నితమైన విషయాలపైన చక్కని చర్చ జరిగింది.‌

నేను కూడా ఒక గజల్ చదివాను . దానికి సభికులు వేదిక మీద వున్న ప్రముఖులు కరతాళ ధ్వనులతో స్పందించారు . గజల్ మాస్ట్రో గజల్ శ్రీనివాస్ గారు మత్లా అద్భుతం అంటూ ప్రశంసించారు . అలాగేపెద్దలందరికీ నా గజల్ సంపుటాలు పిల్లనగ్రోవి , చిత్రవీణ అందించటం జరిగింది.

నా గజల్స్ చదివిన శ్రీ గజల్ శ్రీనివాస్ గారు సభాముఖంగా నా గజల్స్ ను మెచ్చుకోవటమే కాకుండా నాగజల్స్ ను వారు పాడతానని చెప్పటం చాలా ఆనందంగా అనిపించింది .ఒక గొప్ప అవార్డ్ తీసుకున్న భావన కలిగింది .
వారి తో వేదిక పంచు కోవటమే కాకుండా వారినుండి ప్రత్యేక ప్రశంస అందుకోవటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను . నాజీవితంలో మరిచి పోలేని మధుర సంఘటన.
గజల్ శ్రీనివాస్ గారికి, నాకు ఈ అవకాశం కల్పించిన మల్లెతీగ వ్యవస్థాపక సంపాదకులు శ్రీ కలిమిశ్రీ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను .
ఈ సమావేశం లో ప్రముఖులపైన సాహితీ మిత్రులను కలుసుకోవటం చాలా ఆనందంగా అనిపించింది .
ఈ సందర్భంగా మల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీ గారి పై శంకర్ గారు రాసిన ఒక గజల్ వినిపించారు .గాయని శాంతి నిర్మల గారు నా గజల్ ను వినిపీంచారు.
డా// గజల్ శ్రీనివాస్ గారు కూడా కొన్ని గజళ్ళు గానం చేసి సభను అలరించారు.‌ సభలో రమణ గారి “తేనెవిందు ” గజల్ సంపుటి ఆవిష్కరణ కూడా గొప్పగా జరిగింది. అలాగే, కళారత్న బిక్కి కృష్ణ గారి ” గజల్ సౌందర్యం” పుస్తకం కూడా కనుల విందుగా ఆవిష్కరణ జరిగింది అందరినీ శాలువాతో సన్మానించి మెమొంటోలు ప్రదానం చేసారు .కొన్ని ఛాయా చిత్రాలు మిత్రుల కోసం

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language