శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
నీ జతలో ప్రతిక్షణము స్నేహమేగ తెలుసుకో
నిన్ను తాకు గాలి తోటి వైరమేగ తెలుసుకో
జడి వానల అలజడిలో ఎదలోపల తడబాటు
నిలువరించు నీ ధ్యానం మంత్రమేగ తెలుసుకో
మౌనంలో ఒదిగి వుంది మాటలలో దాగినది
కనుపాపల నీ వలపుల చిత్రమేగ తెలుసుకో
కడలి అలల కొంగు పరిచె ఆశలతో హరివిల్లు
ప్రేమ లలో సేద తీరు ఆత్రమేగ తెలుసుకో
- తొలి చూపులు తోరణంగా మది పలికె స్వాగతం
విజయంగా నీమువ్వల సవ్వడేగ తెలుసుకో !!