నా కల -నా స్వర్గం

శుభోదయం 🌹🌹🌹🌹🌹

ప్రముఖ నవలా రచయిత సాహితీ వేత్త
విశ్రాంత ఉపాధ్యాయలు శ్రీ లెక్కల మల్లా రెడ్డిగారు
తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ,తమ చేతి వ్రాతతో “నాకల -నా స్వర్గం “కవితా సంపుటి పై విలువైన అభిప్రాయాలను అభినందనలు అంద చేసారు . వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏻🙏🏻
శ్రీ మల్లా రెడ్డి గారు FB నేను రోజూ పెట్టే గజల్స్ చూసి ఫోను చేసి అభినందనలు తెలిపారు.నా గజల్ సంపుటాలతో పాటుగా నాకవితా సంపుటిని కూడా వారికి పంపటం జరిగింది .గజల్ సంపుటాలు “పిల్లనగ్రోవి “ “చిత్రవీణ “ పై కూడా వారి అమూల్య అభిప్రాయాలను అభినందనలు అంద చేసారు .వారి నవలలు నాకు పంపారు కానీ అవి ఇంకా నాచేతికి రాలేదు . గుంటూరు అడ్రస్‌కి వెళ్లాయి .త్వరలోనే అందుకుంటాను.
సాహిత్యం విలువ తెలిసిన వారు ఇచ్చే ఒక్క అభినందన. ఎన్నో గొప్ప అవార్డులకు
పురస్కాలను మించినదని నాఅభిప్రాయం .వారికి మరో మారు నా ధన్యవాదాలు .
నా కవితా సంపుటిపై , గజల్ సంపుటాలపై ఆత్మీయులందరూ చక్కటి సమీక్ష లందించారు .అవి నాకు జీవితం లో అత్యంత విలువైన ప్రశంసా పత్రాలు .
వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు 🌹🌹🌹🌹🙏🏻🙏🏻

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language