శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
ముళ్ళబాట కష్టమేదొ తెలుసుకునే నడిచేసా
పూల దెబ్బ గట్టిదనీ తెలియకనే అడుగేసా
గుర్తులలో గుల్మొహరులు విచ్చుకున్న వివశంలో
చేరువవని తీరాలను చెమ్మలలో వదిలేసా
కనులు కూడ రాయగలవు కన్నీటితొ కావ్యాలను
వెతలు నింపు అక్షరాల అధరాలను అదిమేసా
దూరమెంత జరిగిందో …కాలమెంత కరిగిందో…
చెలిమేదో చేయి జాచ…చెమరింపులు చెరిపేసా
శత్రువైన తలుపు తడితె హత్తుకునే మనసేగా
మదినిండిన మకిలంతా “విజయంగా కడిగేసా!